సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన
ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 5 (విజయక్రాంతి): మెట్రో ప్రయాణికుల కోసం గూగుల్ వ్యాలెట్‌తో టికెట్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మంగళవారం హైటెక్ సిటీలోని రాడిసన్ హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొ ని.. రూట్ మొబైల్, గూగుల్ వ్యాలెట్, బెల్ ఈజీ సంస్థల భాగస్వామ్యంతో ఆర్సీఎస్ ఆధారిత టికెట్ కొనుగోలు సేవలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్సీఎస్ ఆధారిత సేవతో ప్రయాణికులు తమ ఫోన్ల ద్వారా ప్రత్యక్షంగా టికెట్ కొనుక్కోవచ్చన్నారు. హైదరా బాద్ మెట్రోల్లో రద్దీని తగ్గించేందుకు త్వర లో నాగ్‌పూర్ నుంచి మరో 4 రైళ్లను తీసుకురాబోతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రూట్ మొబైల్ ఎండీ, సీఈవో రాజ్‌దీప్‌కుమార్ గుప్తా , మెట్రో రైల్ సీవోవో సుధీర్ చిప్లుంకర్, ఎల్‌అండ్‌టీ మెట్రో జేజీఎంబీ భుదత్తమిశ్ర, రూట్ మొబైల్ ఉపాధ్యక్షుడు సుమిత్ జవార్, బిల్ ఈజీ సీఈవో ఆకాశ్‌పాటిల్ తరులు పాల్గొన్నారు.