calender_icon.png 5 January, 2025 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు

31-12-2024 02:11:41 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 30(విజయక్రాంతి): నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31న (మంగళవారం) అర్ధరాత్రి వరకు మెట్రో రైల్ సర్వీసులను నడపనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెట్రో సర్వీసుల సమయవేళలను అర్ధరాత్రి 12.30గంటల వరకు పొడిగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

రెడ్, బ్లూ, గ్రీన్‌లైన్లలో గల మెట్రో చివరి స్టేషన్ల నుంచి అర్థరాత్రి 12.30 గంటలకు చివరి రైలు ప్రారంభమై 1.15గంటలకు ముగింపు స్టేషన్‌కు చేరుకుంటుందని చెప్పారు. నూతన ఏడాది వేడుకల నేపథ్యంలో నగర ప్రజలకు అర్ధరాత్రి వరకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో ఎండీ తెలిపారు.