calender_icon.png 17 January, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్రో ఫేజ్-2 పనులు వేగవంతం

11-07-2024 02:29:32 AM

జాతీయ రహదారుల అధికారులతో మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి సమావేశం

ప్రతిపాదిత రూట్లలో స్టేషన్ల ఏర్పాటు, పనులపై చర్చ

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 10 (విజయక్రాంతి): మెట్రో ఫేజ్ పనుల కోసం మియాపూర్ ఎల్బీనగర్ కారిడార్లను హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్.రెడ్డి ఇంజనీరింగ్ నిఫుణులతో కలిసి బుధవారం పరిశీలించారు. జాతీయ రహదారులపై ఉన్న మైలార్‌దేవ్‌పల్లి హైకోర్టు స్పర్‌లైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ రూట్లలోని పాత, కొత్త ఫ్లు ఓవర్ల కారణంగా ఫేజ్ 2 పనులకు ఎదురయ్యే ఇంజనీరింగ్ సవాళ్లను పరిష్కరించే అంశాలపై ఆయన బుధవారం రసూల్‌పురలోని మెట్రో రైలు భవన్‌లో జాతీయ రహదారుల అధికారులతో సమావేశమయ్యారు.

ప్రతిపాదనకు వచ్చిన అంశాలు..

  1. * ఎల్బీనగర్‌ొోహయత్‌నగర్ మెట్రో ఫేజ్‌ూ కారిడార్‌ను జీహెచ్‌ఎంసీకి చెందిన ప్రస్తుత 2 ఫ్లు ఓవర్ల మధ్య ఎల్‌బీనగర్ జంక్షన్ వద్ద ఉన్న మెట్రో వయాడక్ట్‌కు పొడిగించి నిర్మిస్తారు.  చింతలకుంట నుంచి హయత్‌నగర్ వరకు, ఎన్‌హెచ్‌ఏ అధికారులు 4 కొత్త ఫ్లుఓవర్లను నిర్మిస్తున్నందున మెట్రో అలైన్ మెం ట్ ఎడమవైపు సర్వీస్ రోడ్డులో ఉంటుంది. 
  2. * నిర్మాణంలో ఉన్న ఫ్లుఓవర్లు, మెట్రోరైల్ పిల్లర్లు, వయాడక్ట్, స్టేషన్ల ఇంజనీరింగ్ డ్రాయింగ్‌లు వైమధ్యాలకు అవకాశం ఇవ్వకుండా నివారించడానికి ఇరువైపులా అధికా రులు సమన్వయం చేసుకుంటున్నారు. ఈ కారిడార్‌లో ప్రతిపాదించిన 6 మెట్రో స్టేషన్లలో కొన్నింటిని ఫ్లుఓవర్ల మీదుగా ఎన్‌హెచ్ లకు ఆటంకం లేకుండా సులభంగా యాక్సెస్ చేసే విధంగా ప్రణాళిక రచిస్తున్నారు. 
  3. * మియాపూర్  పటాన్‌చెరు మెట్రో కారిడార్‌ను ఎన్‌హెచ్ సెంట్రల్ మీడియన్‌లో మెట్రో వయాడక్ట్‌ను నిర్మించాలని ప్రతిపాదించారు. గంగారం వద్ద 1.2కిమీ పొడవైన ఫ్లుఓవర్‌ను హెచ్‌ఏఎంఎల్, ఎన్‌హెచ్ ఇంజనీర్లు సంయుక్తంగా డబుల్ డెక్కర్ ఫ్లుఓవర్ కమ్ మెట్రో వయాడక్ట్‌ను నిర్మించే సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. కాగా.. ఈ స్ట్రెచ్‌లో కుడి వైపున ఓ మతపరమైన కట్టడం ఉండటం వలన ఈ ప్రతిపాదన జరిగింది. 
  4. * బీహెచ్‌ఈఎల్ జంక్షన్ వద్ద నిర్మాణంలో ఉన్న అండర్ గ్రౌండ్ ఫ్లుఓవర్ వద్ద ఎడమ వైపునకు మెట్రో అలైన్‌మెంట్ ఉంటుంది. బీహెచ్‌ఈఎల్ జంక్షన్ వద్ద ఉన్న టీజీ ఎస్‌ఆర్టీసీ బస్టాప్‌తో బీహెచ్‌ఈఎల్ మెట్రో స్టేషన్ అనుసంధానం అవుతుంది.
  5. * నాగోల్  ఎల్‌బీనగర్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్‌కు స్పర్‌లైన్‌గా నిర్మిం చే మైలార్‌దేవ్‌పల్లి జంక్షన్ హైకోర్టు స్పర్‌లైన్‌లో పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేకి ఎడమవైపున అలైన్‌మెంట్ ఉంటుంది. పీవీఎన్ ఆర్ ఎక్స్‌ప్రెస్ వే, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఫ్లుఓవర్ మధ్య కుడివైపునకు మళ్లుతుంది. 

ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ (ఎన్‌హెచ్) ఈఎన్‌సీ గణపతిరెడ్డి, జాతీయ రహదారుల ఎస్‌ఈ ధర్మారెడ్డి, హెచ్‌ఏఎంఎల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆనందమోహన్, ఎస్‌ఈ సాయపరెడ్డి, జనరల్ మేనేజర్లు రాజేశ్వర్, విష్ణువర్ధన్‌రెడ్డి, సీనియర్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.