calender_icon.png 27 January, 2025 | 9:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్రో పెయిడ్ పార్కింగ్‌ను పూర్తిగా రద్దుచేయాలి

26-08-2024 04:19:08 AM

పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 25 (విజయక్రాంతి): మెట్రో పెయిడ్ పార్కింగ్ తాత్కాలిక వాయిదా కాదు.. పూర్తిగా రద్దు చేయాలని పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎస్.ప్రదీప్ అన్నారు. నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద ఉచిత పార్కింగ్ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ప్రొగ్రెసివ్ యూత్ లీగ్ (పీవైఎల్), ప్రయాణికుల తో కలిసి ఆదివారం నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ.. మెట్రో రైలు ప్రయాణంపై ఆధారపడిన ప్రయాణికులకు పార్కింగ్ చార్జీలు మరో ఆర్థిక భారంగా మారిందన్నారు.ఆందోళనల నేపథ్యంలో ప్రస్తుతం పెయిడ్ పార్కింగ్‌ను తాత్కాలిక వాయిదా వేస్తున్నామని ప్రకటించిన మెట్రో యంత్రాంగం పూర్తిగా పెయిడ్ పార్కింగ్‌ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎం.హ్యన్మేశ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రవికుమార్, బి.ఎస్.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.