calender_icon.png 31 January, 2025 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్రోకు సుస్తి!

30-01-2025 01:07:05 AM

  1. సాంకేతిక లోపంతో గంటపాటు నిలిచిన సర్వీసులు
  2. నాగోల్-రాయ్‌దుర్గ్ మధ్య రాకపోకలకు అంతరాయం
  3. ఇబ్బందులు పడ్డ మెట్రో ప్రయాణికులు

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 29 (విజయక్రాంతి): నగర ప్రజలను తమ గమ్యస్థానాలను చేర్చడంలో కీలకంగా వ్యవహరి  హైదరాబాద్ మెట్రో రైళ్లల్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో బుధవారం గంటపా  సర్వీసులు నిలిచాయి. ఉదయం 7 నుం  8 గంటల ప్రాంతంలో ఈ సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది.

జూబ్లీ చెక్‌పోస్ట్ మెట్రో  ఒక రైలు దాదాపు గంటపాటు నిలిచినట్టు, ఆ సమయంలో రాయ్‌దుర్గ్ నుంచి అమీర్‌పేట్‌కు, అక్కడి నుంచి రాయ్‌దుర్గ్‌కు రాకపోకలకు ఇబ్బందులు కలిగినట్టు సమాచారం. అమీర్‌పేట్ నుంచి నాగోల్ వైపు, అటు నుంచి అమీర్‌పేట్‌కు వచ్చే రైళ్లు కూడా సాంకేతిక సమస్యతో ఆలస్యంగా నడిచాయి.

తార్నాక నుంచి రాయ్‌దుర్గ్‌కు పలు సర్వీసులు ఆలస్యంగా నడిచినట్టు సమాచారం. నాగోల్ నుంచి మెట్రో రైళ్లు దాదాపు గంట పాటు ఆలస్యంగా నడిచినట్టు తెలుస్తోంది. దీంతో ప్రధానంగా నాగోల్-  బ్లూ కారిడార్‌లో మెట్రో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడంతో తీవ్ర అంతరాయం కలిగింది. మిగతా కారిడార్లలోనూ సర్వీసులకు ఆటంకం కలిగినట్టు తెలుస్తోంది.

పలు మెట్రో స్టేషన్లలో మెట్రో రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నట్లు బోర్డు ప్రదర్శించారు. కాగా సిగ్నలింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపంతో మెట్రో రైలు సర్వీసులకు కొంతసేపు అంతరాయం కలిగిందని, తక్షణమే తాము సమస్యను పరిష్కరించామని ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ సంస్థ సోషల్ మీడియా ఖాతాలో పేర్కొంది. మెట్రో సేవలను పునరుద్ధరించామని, దీని వల్ల మెట్రో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్టు తెలిపారు. 

ఇబ్బందులు పడ్డ ఉద్యోగులు, విద్యార్థులు

హైదరాబాద్‌లోని మూడు మెట్రో కారిడార్లలో ప్రతీరోజు దాదాపు 5 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఉదయం, సాయంత్రం ఉద్యోగులు, విద్యార్థులే దాదాపు 3 లక్షలకు పైగా ఉంటారని అంచనా. బుధవారం ఉదయం మెట్రో సర్వీసులకు ఆటంకం కలగడంతో నాగోల్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, అమీర్‌పేట్, జూబ్లీ చెక్‌పోస్ట్, రాయ్‌దుర్గ్ సహా పలు మెట్రో స్టేషన్లలో ప్రయాణికులతో రద్దీ నెలకొంది. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

మూడునెలల్లో రెండోసారి

హైదరాబాద్ మెట్రో సర్వీసుల నిర్వహణను ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ సంస్థ నిర్వహిస్తోంది. సీబీటీసీ (కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్) అనే సాంకేతికతతో రైళ్లను నడుపుతున్నారు. కానీ ఇటీవల కాలంలో రెండు, మూడు నెలలకోసారి మెట్రో రైళ్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడం పరిపాటిగా మారింది. గతేడాది నవంబర్ 4న బేగంపేట స్టేషన్‌లో ఓ మెట్రోరైలు రెండు సార్లు దాదాపు అరగంట పాటు నిలిచిన విషయం తెలిసిందే.

తాజాగా బుధవారం పలు స్టేషన్లలో రైళ్లు నిలిచిపోవడం, ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే మెట్రోకు విద్యుత్ సరఫరా చేసే ట్రాక్షన్ వైర్లు సున్నితంగా ఉండటం, దుమ్మూ, ధూళి, పొల్యూషన్ కారణంగా పలుమార్లు బ్రేక్‌డౌన్, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని తెలుస్తోంది.