సంచికను ఆవిష్కరించిన : చైర్మన్ సీఎల్.రాజం
తెలంగాణ ప్రజల మన్ననలు పొందిన ‘మెట్రో ఇండియా’ ఆంగ్ల దినపత్రిక కొత్త హంగులతో పాఠకుల ముందుకు వచ్చింది. సోమవారం నాటి సంచికను మెట్రో ఇండియా దినపత్రిక కార్యాలయం ఆవరణలో ఆ పత్రిక చైర్మన్ చిలప్పగారి లక్ష్మీరాజం ఆవిష్కరించారు.
మేనేజింగ్ డైరెక్టర్ చిలప్పగారి విజయ, డైరెక్టర్లు చిలప్పగారి శ్రీకాంత్, చిలప్పగారి సౌమ్య, సీఈవో రాహుల్, మెట్రో ఇండియా దినపత్రిక ఎడిటర్ వీజేఎం దివాకర్, విజయక్రాంతి దినపత్రిక ఎడిటర్ కే కృష్ణమూర్తి, మెట్రో ఇండియా దినపత్రిక, విజయక్రాంతి దినపత్రిక సిబ్బంది పాల్గొన్నారు.