calender_icon.png 10 January, 2025 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్రో పొడగింపు న్యూ ఇయర్ గిఫ్ట్

02-01-2025 02:26:46 AM

మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): నూతన సంవత్సర కానుకగా శామీర్‌పేట, మేడ్చల్ వరకు మెట్రో మార్గాలను పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తంచేశారు. గతంలో శామీర్‌పేట వరకు మెట్రోను పొడిగించాలని తాను సీఎం దృష్టికి తీసుకుపోయినట్టు మంత్రి బుధవారం ఒక ప్రకటన లో గుర్తుచేసుకున్నారు.

సుదీర్ఘ కాలంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన కరీంనగర్, మెద క్, నిజామాబాద్, ఆదిలాబాద్ వైపు వెళ్లే వాహనదారులు నగర శివారు వరకు నిత్యం ట్రాఫిక్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ తరుణంలో సీఎం తీసుకున్న నిర్ణ యంతో నగరంలో రద్దీ సమస్యలు తప్పుతాయని చెప్పారు. ఇప్పటికే ఈ మార్గంలో డబుల్ డెక్కర్ ఫ్లు ఓవర్ మంజూరు కావడంతో ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయ న్నారు.

ఇప్పుడు జేబీఎస్ నుం చి శామీర్‌పేట (22 కి.మీ), ప్యారడైజ్ నుంచి మేడ్చల్ (23 కి.మీ) వరకు మెట్రో రైల్ ఫేజ్-2బీలో భాగంగా డీపీఆర్‌కు సీఎం ఆదేశించడంతో నగరంలో ఉత్తర తెలంగాణవాసుల ప్రయా ణ కష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయన్నారు. శామీర్‌పేట, మేడ్చల్ వరకు మెట్రో మార్గం కోసం నిర్ణయం తీసుకున్నందుకు సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మెట్రో పూర్తయితే హైదరాబాద్ నుంచి ఉత్తర తెలంగా ణ జిల్లాలకు వెళ్లేవారికి చాలా సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు.