calender_icon.png 9 January, 2025 | 3:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నైపుణ్యాల ప్రదర్శనకు వేదికగా మెట్రో

09-01-2025 01:44:43 AM

  • ఈ నెల 8 మధ్య పలు స్టేషన్లలో సంక్రాంతి సంబరాలు
  • హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఎల్‌అండ్‌టీ మెట్రో ఎండీ కేవీబీరెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 8 (విజయక్రాంతి): ఈ నెల 8 వరకు నగరం లోని పలు మెట్రో స్టేషన్లలో సంక్రాంతి సం బరాలు నిర్వహిస్తున్నామని, హైదరాబాద్‌లోని పలు మెట్రో స్టేషను ్ల నైపుణ్యాలను ప్ర  దర్శించుకునేందుకు వేదికగా నిలువబోతున్నాయని హైదరాబాద్ మెట్రో రైల్ లిమి టెడ్(హెచ్‌ఎంఆర్‌ఎల్), ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ ఎండీ కెవిబీరెడ్డి పేర్కొన్నారు.

సంక్రాం తి సందర్భంగా ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ సం స్థ ఆధ్వర్యంలో చేపట్టిన ‘మీ టైం ఆన్ మై మె ట్రో’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా రూపొందించిన స్మార్ట్ కార్డు, వీడి యోలు, ప్రచార కార్యక్రమాలను ప్రతిబింబించేలా రూపొందించిన మెట్రో రైలును వారు జెండా ఊపి ప్రారంభించా రు.

అంత కు ముందు ఎన్వీఎస్‌రెడ్డి మాట్లాడు తూ మె ట్రో ప్రయాణికులు అనేక మందిలో దాగి ఉన్న వివిధ కళా, సాహిత్య, సాంస్కృతిక రం గాల్లోని అభిరుచిని ప్రదర్శించుకునే గొప్ప అవకాశాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచనలను పరిగణనలోకి తీసుకుని మరింత అభివృ ద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

జాయ్‌ఫుల్ జర్నీ  కేవిబీరెడ్డి

మెట్రో ప్రయాణికులకు జాయ్‌ఫుల్ జ ర్నీ ఇచ్చే ఉద్దేశంతో సంక్రాంతి సంబరాల ను నిర్వహిస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ కేవీబీ రెడ్డి పేర్కొన్నారు. రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లను కొనుగోలు చేస్తామని తెలిపారు. 

కొత్త కారిడార్లకు మెగా జంక్షన్

హైదరాబాద్ మెట్రో ఫేజ్ లో భాగంగా చేపట్టిన పార్ట్ ఏలో ఐదు కారిడార్లకు డీపీఆర్‌లను సిద్ధం చేసి ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు ఎన్వీఎస్‌రెడ్డి చెప్పారు. కేంద్రం నుంచి అనుమ తులు రాగానే పను లు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ లోగా పాతనగరంలో భూసేకరణ చేస్తూనే, రోడ్డు విస్తరణకు, మెట్రో నిర్మాణానికి కూల్చివేతల పను లు త్వరలోనే చేపట్టనున్నట్టు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.