టెక్ రంగంలో ఆగని లే ఆఫ్‌లు
జూలైలో 8 వేల మంది తొలగింపు
న్యూఢిల్లీ, ఆగస్టు 6: ప్రపంచ ఆర్థిక మందగమనం నేపథ్యంలో టెక్ కంపెనీల్లో ఉద్యోగులు తొలగింపు మరింత తీవ్రం అవుతున్నది. ఈ ఏడాది ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో 124,517 మంది ఉద్యోగులను ఇంటికి పంపినట్టు నివేదికలు వెల్లడించాయి. జూలై నెలలో 34 టెక్ సంస్థల్లో 8000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు.
భారత్‌లో పలు స్టార్టప్ కంపెనీలకు పెట్టుబడులు ముఖం చాటేయటంతో విధిలేక ఉద్యోగాల్లో కోతలు పెడుతున్నాయి. సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ‘కూ’ ఏకంగా మూతపడింది. ఇందులో పనిచేసే 200 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. కెర్స్‌పెర్స్‌కీ 50, రేషామండి 400 (80 శాతం), అన్‌అకాడమీ 250, వేకూల్ 200, పాకెట్ ఎఫ్‌ఎం 200, బంగీ 220, హంబుల్ గేమ్స్ 36 (100 శాతం) ఉద్యోగులను తొలగించాయి.