calender_icon.png 10 January, 2025 | 10:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్నాప్‌చాట్‌లో పరిచయమై..

05-01-2025 01:57:20 AM

  1. రూ.48లక్షల సైబర్ దోపిడీ
  2. ముగ్గురు నిందితుల అరెస్టు 

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 (విజయక్రాంతి): పోలీసులమని నమ్మించి ఓ మహిళ నుంచి రూ.48 లక్షలు సైబర్ దోపిడీ చేసిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. నగరానికి చెందిన ఓ మహిళకు స్నాప్‌చాట్‌లో అమన్‌జోషి అనే వ్యక్తి పరిచయమయ్యాడు.

ఆమె నుంచి రూ.15వేలు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించలేదు. అనంతరం ఆమె, అమన్‌జోష్ వద్ద అక్రమంగా బంగారం ఉందని నకిలీ పోలీసుల వేషధారణలో హెచ్చరించారు. బెయిల్ కావాలంటే రూ.1.60 లక్షలు ఇవ్వాలని, లేదంటే అరెస్ట్ చేస్తామని బెదిరించారు. ఆ తర్వాత దాన్ని రూ.2 లక్షలకు పెంచారు.

ఇలా రూ.48.38 లక్షల వరకు లూటీచేశారు. మోసాన్ని గ్రహించిన బాదితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితులు అమన్‌జోషి, ప్రశాంత్ బిరాదర్, రోహిత్‌ను అరెస్ట్ చేశారు. వీరు పలు బ్యాంకు అకౌంట్‌ల ద్వారా నేరానికి పాల్పడ్డట్లు గుర్తించారు. నిందితుల నుంచి 3 సెల్‌ఫోన్లు, 5 చెక్ బుక్కులు, 5 డెబిట్ కార్డులు, ఒక క్రెడిట్ కార్డు, 3 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.