calender_icon.png 24 October, 2024 | 6:57 PM

యమపాశంతో చెలగాటం

15-10-2024 12:00:00 AM

కోలాహలం రామ్ కిశోర్ :

యురేనియం తవ్వకాలతో ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. భారత్‌దేశంలోని  యురేనియం నిల్వల్లో 50శాతం కడప జిల్లా ఎం.తుమ్మల పాలెంలోనే ఉన్నాయి. ఏపీలో 1,22,570 టన్ను లు, తెలంగాణలో 15,731 టన్నుల నిల్వ లు ఉన్నట్లు గుర్తించినట్లు ఇటీవల కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని కనంపల్లి, తెలంగాణలోని చిత్రియాల వద్ద కొత్త గనులు, ప్లాం ట్లు ఏర్పాటు చేసే విషయంపై యురేని యం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలు ప్రారంభించిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గత ఏడాది నవంబర్‌లో  పార్లమెంటులో తెలిపారు.

ఈ పనులన్నీ వివిధ దశల్లో ఉన్నట్లు తెలిపారు. తెలంగా ణ సహా 11 రాష్ట్రాల్లో ఏఎండి కొత్తగా చేపట్టిన అన్వేషణలో గత ఏడాది సెస్టెంబర్ నాటికి 4.10 లక్షల టన్నుల యురేనియం నిల్వలను కనుగొన్నట్లు కేంద్రమంత్రి  చెప్పడంతో మరోసారి కలకలం మొదలైంది.

అత్యంత ఖరీదైన ఖనిజం

యురేనియం అరుదుగా లభించే ఖని జం. అత్యంత ఖరీదైనది. అంతర్జాతీయ మార్కెట్‌లో శుద్ధి చేసిన కిలో యురేని యం ధర బిలియన్ డాలర్లలో ఉంటుంది. దీన్ని అణు రియాక్టర్లలో ఇంధనంగా వాడతారు.7 కిలోల యురేనియంతో ఒక అణు బాంబును తయారు చేయవచ్చు. విద్యుత్ ఉత్పత్తి కోసం వాడతారు.

ఉపగ్రహాలను రోదసిలోకి పంపటానికి తక్కువ పరిమాణంలో వాడతారు.-------- యురేనియం భూమి నుండి తవ్వి తీయగానే గాలిలోని ఆక్సిజన్‌తో కలిసి ఆక్సైడ్‌గా మారుతుంది. దీని సాంద్రత సీసం కంటే 75 శాతం ఎక్కువ. యురేనియం కిరణాలు క్యాన్సర్ ను కలిగిస్తాయి. యురేనియంను ప్రాసెస్ చేసేట ప్పుడు వ్యాపించిన ధూళి పర్యావరణంలో వ్యాపించి గాలి, నీరు, నేల విషతుల్యంగా మారుతాయి.

నీటిలో కరుగుతుంది. దాని అవశేషాల వల్ల చర్మ రోగాలు, నపుంసకత్వం వస్తాయి. మూత్రపిండాలు దెబ్బతిం టాయి. క్యాన్సర్ కారకం కూడా. అందుకే అనేక ఐరోపా దేశాలు యురేనియం ప్రాసెసింగ్ పరిశ్రమలు ప్రజలు, పర్యావర ణ శాస్త్రవేత్తల పోరాటాలవల్ల మూతపడ్డాయి. 1984లో రష్యాలో చెర్నోబిల్‌లో అణు ధార్మికత వల్ల సుమారు లక్షమంది చనిపోయారు.

2011లో జపాన్‌లో ‘పుకుషిమా’ అణు కేంద్రంలో లీకేజీతో లక్షమం ది చనిపోయారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం కడప జిల్లాలోని వేముల మండలం తుమ్మలపల్లిలో, నల్లగొండ జిల్లాలోని లంబాపూర్ పెద్దగట్టు ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చింది.

అయితే పర్యావరణవేత్తలు, రాజకీయ పక్షాలు, జర్నలిస్టులు స్థానిక ప్రజల నిరసనల కారణంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయిన తర్వాత  పెద్దగ ట్టు ప్రాంతలో యురేనియం తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం 2019లో ఉప సంహరించుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలోనే ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో ఈ వివాదం అప్పటికి సద్దుమణిగింది.  

భూగర్భ జలాలకు ముప్పు

తెలంగాణలో నల్లగొండ జిల్లా లంబాపూర్- పెద్దగట్టు ప్రాంతంలో భూగర్భ జలాలలో ప్రమాదకర స్థాయిలో యురేని యం గాఢత ఉన్నదని హైదరాబాద్ అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ (ఏఎండీ) ప్రజల నూ, తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇది జరిగి  ఇప్పటికే 5 సంవ త్స రాలు గడిచి పోయాయి. అక్కడి పరిస్థితు లు ఎంతగా దిగజారాయో తెలియదు.

రాయలసీమలో పరిస్థితి

--కడప జిల్లా వేముల మండలం, తుమ్మలపల్లె వద్ద యురేనియం తవ్వకాల వల్ల గని ప్రాంతమంతా విషపూరితం అయిం ది. ఈ తవ్వకాలను భారత యురేనియం సంస్థ (యూసీఐఎల్) నిర్వహిస్తుంది. ఈ సంస్థకు 2007లో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర  ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సుమారు రూ.1103 కోట్ల నిధులను కేటాయించింది.

తుమ్మలపల్లె వద్ద 1700 ఎక రాల విస్తీర్ణంలో యురేనియం ప్రాసెసింగ్ కర్మాగారం ఏర్పర్చారు. రోజుకు 2500 టన్నుల వరకు ముడి ఖనిజాన్ని తీసి శుద్ధి చేస్తున్నారు. స్థానిక  ప్రభుత్వాల అనుమతి, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులతో  నిమి త్తం లేకుండా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ కాలుష్య నియంత్రణ మండలి నిభందనలను సబ్ కాంట్రాక్టర్లు పట్టించుకోవటం లేదు.

విడుదల అవుతున్న యురే నియం వ్యర్థాలు, ఎర్రని బురద నీళ్ల రూపంలో ఉంటాయి. వర్షపు నీళ్ళతో కలి సి భూమిలోకి ఇంకుతాయి. వందల, వేల ఎకరాల్లో భూగర్భ జలాలు కలుషితం అవుతాయి. పంట పొలాలు విషతుల్యమై బీడు భూములుగా మారుతాయి. అయి నా ఎలాంటి రక్షణ చర్యలూ తీసుకోరు.

భూగర్భ జలాలే దిక్కు

తెలంగాణ, రాయల సీమ దుర్భిక్ష పీడి త  ప్రాంతాలు. ఈ ప్రాంతాలకు  భూగర్భ జలాలే దిక్కు. వేల సంఖ్యలో బోర్లు వేసి  వ్యవసాయానికి, తాగునీటికి వాడుతారు. పండిన పంటలలో ఈ యురేనియం చేరుతుంది. పరిసర ప్రాంతాలలో కంటికి కన పడని యురేనియం కిరణాలు వ్యాపిస్తా యి. ఆ ధూళిపై నుండి వీచే గాలిని పీల్చిన ప్రజలకు శ్వాస కోశ వ్యాధులు వస్తాయి. క్యాన్సర్‌కు కారకమవుతున్నాయి. 

ప్రమాదస్థాయికి మించి గాఢత 

నల్లగొండ జిల్లా లంబాపూర్ - పెద్దగట్టు ప్రాంతం అంతటా భూగర్భ జలాలలో యురేనియం గాఢత ప్రమాదకర స్థాయిని మించి అనేక రెట్లు ఉన్నట్లుగా అక్కడ నీటి నమూనాలు  సేకరించి, పరీక్షలు జరిపి అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ (ఏఎండీ) శాస్త్ర వేత్తలు ప్రకటించారు. ఈ అణు శక్తి పట్ల ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ సంస్థలకు ఎర్రజెండా ఊపారు.

క్రమంగా కాల్వల ద్వారా ఈ నీరు కృష్ణాజలలో కలసి పోతాయు. ఈ నీరు తాగిన పశువులు, పక్షులు, మనుషు ల, ఇతర జీవులు అనేక రోగాలతో అంతరిస్తాయని హెచ్చరికలు ఉన్నా కేంద్రం ఖాతరు చేయటం లేదు. ఈ భూమిపై గడ్డి తిన్న మేకలు, గేదెలు, ఆవులు రోగగ్రస్తం అవుతాయి.వాటిపాలు, మాంసం అన్నీ విషతుల్యమే.వాటిని సేవించిన మనుషులకు అకాల మృత్యవు దాపురిస్తుంది.

సురక్షిత ప్రాంతాలకు తరలించాలి

-ఈ పరిసర ప్రాంతంలో నివసించే ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తర లించాలని, కృష్ణా నదీ జలాలపై ప్రభావం చూపే యురేనియం లీకు కాకుండా చూడాలని ప్రభుత్వ సంస్థలను కోరినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. లంబాపూర్ పెద్దగట్టు ప్రాంతంలోని 8 కిలోమీటర్ల పరిధిలో కనీసం 30,000 మంది ప్రజలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారిని సురక్షి త ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉందని లంబాపూర్ -పెద్దగట్టు ప్రాంతం,  పెద్దగట్టు ప్రాంతం వరకు కొన్ని నమూనా బోరు బావులలో కనుగొనబడిన 30 పీపీ బీ అనుమతించదగిన పరిమితికి వ్యతిరేకం గా 2,618 పారట్స్ పర్ బిలియన్ (పీపీబీ) స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వాలను హెచ్చరించినా ప్రయోజనం లేదు.

ప్రజల గోడు వినేదెవ్వరు?

---స్థానిక ప్రజలు, విపక్షాలు, పర్యావరణ వేత్తలు, జర్నలిస్టులు ఎన్ని ఉద్యమాలు చేసినా, పత్రికల్లో ఎంతప్రచారం చేసినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్ని విజ్ఞప్తుల పత్రాలు సమర్పించినా ఉభయ రాష్ట్ర ప్రజ ల ఆరోగ్యం, సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వాలకు చిత్త శుద్ధి లేదు. ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు. అయినా ప్రజలు, మీడియాను, విపక్షాలను కూడగట్టి ప్రజా పోరా టాలు చేసి ప్రభుత్వాలు పట్టించుకొనేలా చేయాల్సిన అవసరం ఎంతయినా ఉంది.

వ్యాసకర్త సెల్:  9849328496