calender_icon.png 10 April, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలతో చెలగాటం

24-03-2025 12:00:00 AM

మాజీ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. ఎన్నో హామీలు గుప్పించి ఇప్పుడు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పీఆర్సీ అమలు చేశామ ని.. కానీ కాంగ్రెస్ సర్కారు 1.25 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తామని చెబుతోందన్నారు.

ఉద్యోగాల నుంచి తీసేస్తే వారి కుటుంబాలు ఏ విధంగా జీవ నం సాగించాలని ప్రశ్నించారు. హామీ ఇచ్చినట్లుగా 2 లక్షల ఉద్యోగాలు నింపిన తరువా త వాళ్ళను తీసేస్తే బాగుంటుందన్నారు. రెగ్యూలరైజ్ చేస్తారని ఆశపడితే వాళ్ళని తీసివేస్తామని అంటున్నారని వారి జోలికి వెళ్ళ వద్దని... వాళ్లకు ఏమైనా అయితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగాల గురించి అడుగుతారని విశ్వవిదాలయాల్లో నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పంట నష్టంతో రైతులు ఆవేదన చెందుతుంటే తాను పరామర్శించినట్లు తెలిపారు. అధికారులు పంట నష్టం సర్వేకు కూడా పోవడం లేదన్నారు. బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్ర చారి ఉన్నారు.