మేయర్ విజయలక్ష్మి
మేడ్చల్, జనవరి 22: నాణ్యత ప్రమా ణాలు పాటించకుండా కల్తీ, అపరిశుభ్ర ఆహార పదార్థాలు తయారీ చేసి ప్రజల ఆరోగ్యం, ప్రాణాలతో చెలగాట మాడితే సహించేది లేదని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హెచ్చరించారు. బుధవారం కూకట్‌పల్లి జోన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ సర్కిల్ సూరారం ప్రాంతంలో గల పలు పిండి వంటల, స్వీట్ తయారి కేంద్రాలను ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీల సందర్భంగా మేయర్ ఆయా షాప్లో అమ్మకానికి ఉన్న నాణ్యతలేని సరుకులను, అపరిశుభ్ర వాతావరణములో తయారు చేస్తున్న పిండి వంటకాలు, ఆహార పదార్థాల తయారీలో కనీస నాణ్యత ప్రమాణాలు పాటించక పోవడాన్ని గుర్తించారు. పిండి, పప్పులు, తదితర సరుకుల పై తయారు తేదీ, ఎక్స్‌రే తేదీ లేకపోవడాన్ని గమనించి, నిల్వ లకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘనల పై ప్రశ్నించారు.
నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, కాలపరిమితి ముగిసిన సరుకులు నిల్వ చేయడం వంటి అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన ఆహార పదార్థాల అమ్మకాన్ని నిరోధించేందుకు ఈ తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. ఇలాంటి వస్తువులు వినియోగించుకునే సందర్భంలో ప్రజలు ఆలోచించాలన్నారు.
ముఖ్యంగా చిన్న పిల్లలు వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు ఈ విషయంలో తల్లి దండ్రులు ఆలోచన చేయాలన్నారు. ఈ తనిఖీ కార్యక్రమంలో అడిషనల్ కమీషనర్ హెల్త్ పంకజ, జిహెచ్‌ఎంసి ఫుడ్ సహాయ కంట్రోల్ ముత్యం రాజు, ఫుడ్ సేఫ్టీ అధికారి లక్ష్మి కాంతం చీఫ్ సి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ పద్మజ, చీఫ్ వెటర్నరీ అధికారి డాక్టర్ అబ్దుల్ వేకీల్ పాల్గొన్నారు.------------------------------------------------------------------------------