calender_icon.png 10 October, 2024 | 2:54 AM

మెస్సీ రీఎంట్రీ

04-10-2024 12:00:00 AM

బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. వెనుజులా, బొలివియాలతో జరగనున్న మ్యాచ్‌లకు మెస్సీ అందుబాటులో ఉండనున్నట్లు కోచ్ లియోనల్ స్కలోని తెలిపారు. ఇటీవలే  చీలమండ గాయంతో పలు మ్యాచ్‌లకు మెస్సీ దూరమైన సంగ తి తెలిసిందే.

దక్షిణ అమెరికన్ క్వాలిఫయింగ్‌లో అర్జెంటీనా 18 పాయిం ట్లతో తొలి స్థానంలో ఉండగా.. కొల ంబియా (16), ఉరుగ్వే (15) తర్వాతి స్థానంలో ఉన్నాయి. టాప్ ఆరు జట్లు 2026 వరల్డ్ కప్‌కు అర్హత సాధించనున్నాయి. కోపా అమెరికా కప్ ఫైనల్ అనంతరం మెస్సీ గాయ ంతో ఆటకు దూరమయ్యాడు. 

సర్జ రీ అనంతరం మేజర్ లీగ్ సాకర్‌లో బరిలోకి దిగిన మెస్సీ ఇంటర్ మి యామికి ట్రోఫీ అందించాడు. బుధవారం అర్థరాత్రి జరిగిన ఫైనల్లో ఇం టర్ మియామి జట్టు 3-2తో కొలంబుస్ క్రూపై విజయం సాధించింది. మ్యాచ్‌లో తొలి హాఫ్‌లోనే మెస్సీ రెండు గోల్స్ చేయడం విశేషం.