calender_icon.png 16 November, 2024 | 4:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచశాంతే గురునానక్ సందేశం

16-11-2024 12:33:01 AM

  1. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో..
  2. వైభవంగా గురునానక్ 555వ జయంతి వేడుకలు

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 15 (విజయక్రాంతి): ప్రపంచశాంతే గురునానక్ సందేశమని సిక్కు మతపెద్దలు పేర్కొన్నారు. గురునానక్ 555 జయంతోత్సవాలను (ప్రకాశ్ ఉత్సవ్) నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో శుక్రవారం వైభవంగా నిర్వహించారు.

గురుద్వారా సాహెబ్ సికింద్రాబాద్, గురుద్వారా శ్రీగురుసింగ్ అశోక్‌నగర్ ప్రబంధక్ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలకు వేలాది మంది సిక్కులు పాల్గొని కీర్తనలను పఠించారు. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ శ్రీదర్బార్ సాహిబ్ లక్వీందర్ సింగ్ జీ, పటియాల నుంచి అమర్జీత్‌సింగ్, హరిసింగ్ జీ, చరణ్‌జిత్ సింగ్‌జీ, జగదేవ్‌సింగ్, హర్విందర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచశాంతి, ఐక్యత, సోదరభావాన్ని గురునానక్ చాటిచెప్పారన్నారు. ఎవరికి హానిచేయకుండా, ఇతరులకు సేవచేస్తూ మానవత్వం చాటాలన్నారు. గురునానక్ బోధనలు సిక్కులు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ ఉత్సవాల్లో గురు కలంగర్ నిర్వహించారు.

కార్యక్రమంలో గురుద్వారా సాహెబ్ సికింద్రాబాద్ అధ్యక్షుడు ఎస్ బల్దేవ్ సింగ్ బగ్గా, జీఎస్‌జీఎస్‌ఎస్ అధ్యక్షుడు ఎస్ సత్వీందర్ సింగ్ బగ్గా, ఉపాధ్యక్షుడు ఎస్ జస్పాల్ సింగ్ తుతీజ, కార్యదర్శులు ఎస్ జగ్మోహన్ సింగ్, హర్ ప్రీత్ సింగ్, జోగిందర్ సింగ్ ముజ్రాల్ తదితరులు పాల్గొన్నారు.

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగిన గురునానక్ జయంతిలో సిక్కులు అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ కార్యక్రమానికి హాజరై సిక్కులకు గురునానక్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.