గురుకులాలకు చెల్లింపుపై ప్రభుత్వం కసరత్తు
- 2004-14 మధ్య గ్రీన్‌చానల్ ద్వారా నిధులు
- స్వరాష్ట్రంలో నిలిపేసిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం
- మళ్లీ పాత విధానంలో చెల్లింపులకు నిర్ణయం
- నాణ్యతా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి
హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత గురుకులాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది. గురు కులాల పనితీరు మెరుగుదల, విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా చర్యలు తీసుకుంటుంది. గురుకులాల్లో సమస్యలను ఒక్కొక్కటిగా పరి ష్కరిస్తున్నది.
ఇందులో భాగంగా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మెస్‌చార్జీలను పెంచిం ది. గురుకులాల అద్దె భవనాల సమస్యలకు కూడా పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకుంటుంది. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గురుకులాల్లో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షి యల్ పాఠశాలలను నిర్మిస్తున్నది.
దీనికోసం వేల కోట్ల రూపాయలను కేటాయించడంతోపాటు పనులు కూడా ప్రారంభించింది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఆయా గురుకులాల్లో తరచూ ఫుడ్ పాయిజన్ ఘట న లు తలెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలకు నాణ్యతా ప్రమాణాలు లోపించడం కూడా ఒక కారణంగా భావించవచ్చు.
వాస్తవానికి గురుకులాలకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు సమయానికి మెస్‌చార్జీలు చెల్లించకపోవడంతో థర్డ్ క్వాలిటీ సరుకులను సరఫరా చేసే అవకాశం ఉంటుంది. ఈ సమ స్యను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో రాష్ట్రంలోని గురుకులాలకు చెల్లించే మెస్‌చార్జీలను త్వరితగతిన విడుదల చేసేలా ప్రణాళికలను రూపొందిస్తుంది.
ఇందులో భాగంగా ప్రతీ నెల పదో తేదీ లోపు చెల్లించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సమయానికి మెస్‌చార్జీలు చెల్లించి భవిష్యత్‌లో ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంపై దృష్టిసారించినట్టు సమాచారం.
నాణ్యతా ప్రమాణాల పెంపే లక్ష్యం
మెస్‌చార్జీలను సమయానికి చెల్లించి గురుకులా ల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇప్పటికే డైట్ చార్జీలను కూడా 40 శాతం పెంచింది. గతంలో రూ.950గా ఉన్న డైట్ చార్జీలను రూ.1,330కి, రూ.1,100గా ఉన్న చార్జీలను రూ.1,540కి, రూ.1,500గా ఉన్న డైట్ చార్జీలను రూ.2,100కు పెంచింది. కాస్మొటిక్ చార్జీలను సైతం పెంచింది.
ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 7.5 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. మెస్‌చార్జీలు పెంచడంతోపాటు సమయా నికి బిల్లులు విడుదల చేసి సప్లు కాంట్రాక్టర్లు పారదర్శకంగా పనులు చేసేలా చర్యలు తీసుకుంటుంది.
అప్పుడు గ్రీన్‌చానల్‌లో చెల్లింపులు
తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రారంభమైన గురుకులాలపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం కనబరిచింది. పదేళ్లలో కావాల్సిన స్థాయిలో మెస్‌చార్జీలు పెంచలేదు. తద్వారా గురుకులాల్లో మౌలిక సదుపాయాల కల్పన లోపించింది. వాస్తవానికి 2004 నుంచి 2014కి మధ్య కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గురుకులాల మెస్‌చార్జీల చెల్లింపులు గ్రీన్ ఛానల్ ద్వారా జరిగేవి.
కానీ 2014 అనంతరం బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో గ్రీన్‌చానల్ ద్వారా మెస్ చార్జీలు చెల్లించే విధానాన్ని రద్దు చేశారు. దీంతో అనేక సమస్యలు తలెత్తాయని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గురుకులాలకు సంబంధించిన మెస్‌చార్జీల ను మళ్లీ గ్రీన్‌ఛానల్ విధానంలో ఇవ్వడంతోపాటు ప్రతీ నెల పదో తేదీ లోపు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.