calender_icon.png 30 January, 2025 | 8:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగోబా జాతరలో ‘మెస్రం’ల బేటింగ్

30-01-2025 01:41:48 AM

ఆదిలాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): తెలంగాణలోనే అతిపెద్ద రెండవ గిరిజన జాతరలో ఒకటైన నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో వైభవంగా కొనసాగుతున్నది. నాగోబా దేవతకు మంగళవారం అర్ధరాత్రి మెస్రం వంశ పెద్దలు మహాపూజలు నిర్వహించారు.

మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారు జామువరకు బేటింగ్ నిరహించారు. 54 మంది మెస్రం వంశస్థుల కొత్త కోడళ్లు ఈ భేటింగ్‌లో పాల్గొన్నారు. ఇద్దరి చొప్పున కూర్చోబెట్టి వారిపై తెలుపు రంగు ముసుగు వేసి పూజ సమయంలో నాగదేవత దరనం చేయించారు. మర్రిచెట్టు సమీపంలో గోవడ్ వద్ద తయారు చేసిన వంటకాలతో నైవేద్యం సమర్పించారు. ఆ తరాత ఉపవాస దీక్షలో ఉన్న కొత్త కోడళ్లు సహాపంక్తి భోజనాలు చేశారు.