calender_icon.png 11 May, 2025 | 11:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెరిట్ స్కాలర్ షిప్ 16 వేలకు పెంపు

23-04-2025 12:00:00 AM

ఉత్తర్వులు జారీ చేసిన సింగరేణి

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయ క్రాంతి): ఎంసెట్, నీట్, జేఈ ఈ మెయిన్స్, ఎయిమ్స్ తదితర కో ర్సుల ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన సింగరేణి కార్మికుల, అధికారుల పిల్లలకు అందిస్తోన్న వార్షిక స్కాలర్ షిప్ మొ త్తాన్ని రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెంచుతూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. కనీస అర్హత ర్యాంక్‌ను కూడా 2 వేల లోపు నుం చి 8 వేల లోపు వరకు పెంచినట్టు బుధవారం ఒక ప్రకటనలో తెలిపిం ది.

స్కాలర్‌షిప్ మొత్తాన్ని పెంచాలం టూ విజ్ఞప్తులు రావడంతో 2010లో 10 వేల రూపాయలకు పెంచారు. తాజాగా గుర్తింపు కార్మికుల సంఘం తో జరిగిన నిర్మాణాత్మక సమావేశం లో స్కాలర్‌షిప్ మొత్తాన్ని 16 వేలకు పెంచాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేసింది. సానుకూలంగా స్పం దించి న సీఎండీ ఎన్.బలరాం సవరించిన స్కాలర్ షిప్‌కు సంబంధించి ఉత్తర్వులను జారీ చేశారు. అన్ని ప్రాంతాల నుంచి జూన్ 15 లోగా దరఖాస్తులు పంపాలని కోరారు. సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.