- మంత్రి ప్రతిపాదనకు ఆమోదం
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
కరీంనగర్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థలో మరో ఐదు గ్రామాలతోపాటు కొత్తపల్లి మున్సిపాలిటీ విలీనం చేస్తూ ప్రభు త్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ అస్తిని స్ట్రేషన్‌కు సెప్టెంబర్‌లో పంపించారు.
కరీంనగర్ రూరల్ మండల పరిధిలోని బొమ్మకల్, దుర్శేడ్, గోపాల్పూర్ గ్రామాలు, కొత్తపల్లి మండల పరిధిలోని చింతకుంట, మల్కాపూర్ గ్రామాలతోపాటు కొత్తగా ఏర్పడ్డ కొత్తపల్లి మున్సిపాలిటీని కూడా కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత మున్సి పల్ ఎన్నికల ముందు 8 గ్రామాలను కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనం చేశారు.
తీగలగుట్టపల్లి, ఆరెపల్లి, సీతారాం పూర్, పద్మనగర్, అల్గునూరు, సదాశివపల్లి, రేకుర్తి, వల్లంపహడ్ గ్రామాలు విలీనమై నాయి. తాజాగా మరో ఆరు గ్రామాలు విలీనం చేయడంతో కరీంనగర్, కొత్తపల్లి మండలంలోని గ్రామాల సంఖ్య తగ్గిపో నుంది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ నగరపాలక సంస్థపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలనే పట్టుదలతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు.
గ్రామాల విలీనం ద్వారా కాంగ్రెస్ పట్టును పెంచుకుని నగరపాలక సంస్థపై జెండా ఎగుర వేయాలనే ఆలోచనతో మంత్రి ఈ విలీన ప్రతిపాదన ముందుంచడంతో పరిశీలించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విలీనం చేస్తూ ఉత్త ర్వులు జారీచేసింది. అయితే ఈ గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ మాజీ సర్పంచులు ఆందోళనబాట పట్టే అవవకాశం ఉంది.