calender_icon.png 24 December, 2024 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోండా, నిస్సాన్ కంపెనీలు విలీనం

24-12-2024 01:18:38 AM

* మూడో అతిపెద్ద వాహన తయారీ సంస్థగా అవతరణ

* 2026 ఆగస్టుకల్లా విలీనం ప్రక్రియ పూర్తి

టోక్యో:  జపాన్ కార్ల తయారీ సంస్థలైన హోండా, నిస్సాన్ కంపెనీలు పరస్పరం విలీ నం కాబోతున్నాయి. ఈమేరకు విలీన ప్రణాళికలను ప్రకటించాయి. దీంతో రెండు సంస్థ లు అమ్మకాల పరంగా ప్రపంచంలో మూ డో అతిపెద్ద వాహన తయారీదారుగా అవతరించినట్లవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచడం, టెస్లా, చైనా వాహన తయారీదారు బీవైడీ వంటి ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ఈ విలీనం ఎంతో ఉపయోగపడుతుందని ఇరు కంపెనీ ల అధికారులు తెలిపారు. మిత్సుబిషి మోటా ర్స్ కూడా ఈ విలీనంలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా హోండా ప్రెసిడెం ట్ తోషిహిరో మిబే మాట్లాడుతూ హోండా, నిస్సాన్ జాయింట్ హోల్డింగ్ కంపెనీకి హోం డా నాయకత్వం వహిస్తుందన్నారు.

బ్యాటరీ లు, ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయడంలో నిస్సాన్‌కు చాలా ఏళ్లుగా అనుభవం ఉంది. ఇది హోండాకు దాని సొంత ఈవీలు, తదుపరి తరం హైబ్రి డ్ వాహనాలు అభివృద్ధి చేసుకోవడంలో సహాయపడుతుందని ఆయన చెప్పారు. 2025 జూన్ నాటికి చర్చ లు పూర్తి చేసి 2026 ఆగస్టు నాటికి విలీనాన్ని పూర్తి చేయాలని ఇరు కంపెనీలు భావిస్తున్నాయి. ఈ విలీ నం వల్ల 50 బిలియన్ డాలర్ల(సుమారు రూ.4 లక్షల కోట్లు)కు పైగా విలువ చేసే కంపెనీగా ఏర్పడబోతున్నట్లు ఇరు సంస్థల అధికారులు పేర్కొన్నారు.

2023లో జరిగిన అమ్మకాల పరంగా టాప్ 10  వాహన తయారీదారుల జాబితా

* టయోటా - 10.3 మిలియన్ వాహనాలు

* ఫోక్స్ వ్యాగన్ గ్రూప్ - 9.2 మిలియన్ వాహనాలు

* హ్యుందాయ్ మోటార్ గ్రూప్ - 7.3 మిలియన్ వాహనాలు

* స్టెలాంటిస్ - 6.4 మిలియన్ వాహనాలు

* జనరల్ మోటార్స్ - 6.2 మిలియన్ వాహనాలు

* ఫోర్డ్ మోటార్ కంపెనీ - 4.4 మిలియన్ వాహనాలు

* హోండా - 4.2 మిలియన్ వాహనాలు

* నిస్సాన్ - 3.4 మిలియన్ వాహనాలు

( విలీన ప్రక్రియ పూర్తుతై హోండా, నిస్సాన్ కలిపి అమ్మకాల్లో టాప్ 3 కంపెనీ అవతరించినట్లువుతుంది.)

* బీఎండబ్ల్యూ గ్రూప్ - 2.6 మిలియన్ వాహనాలు

* మెర్సిడెస్ బెంజ్ - 2.5 మిలియన్ వాహనాలు