సీఎం రేవంత్‌కు మేయర్, డిప్యూటీ మేయర్ కృతజ్ఞతలు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 30 (విజయక్రాంతి): సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసే ప్రక్రియ అనతికాలంలోనే పరిష్కారం కావడం హర్షణీయమని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతశోభన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డికి వారు వేర్వేరు ప్రకటనల్లో కృతజ్ఞతలు తెలియజేశారు. కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ రక్షణ శాఖ తీసుకున్న చర్యలు అభినందనీయమని, అందుకోసం సీఎం రేవంత్‌రెడ్డి చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. కంటోన్మెంట్ వాసులకు మౌలిక సదుపాయాల కల్పన కోసం జీహెచ్‌ఎంసీ తమ వంతు బాధ్యతను నిర్వహిస్తుందని తెలిపారు.