calender_icon.png 14 January, 2025 | 3:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్తూరు గ్రామాన్ని గడ్డపోతారం మున్సిపాలిటీలో కలపండి

23-12-2024 08:16:36 PM

కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కోరిన గ్రామస్తులు...

పటాన్ చెరు: కొత్తగా ఏర్పడుతున్న గడ్డపోతారం మున్సిపాలిటీలో నల్తూరు గ్రామాన్ని కలపాలని గ్రామస్తులు సోమవారం కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ప్రజావాణిలో కలెక్టర్ కు, పటాన్ చెరులో ఎమ్మెల్యేకు వినతి పత్రాలను అందజేశారు. గడ్డపోతారం మున్సిపాలిటీలో కలుస్తున్న గ్రామాలలో నల్తూరు గ్రామం కూడా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని, కొంతమంది అధికారులను తప్పుదోవ పట్టిస్తూ నల్తూరు గ్రామాన్ని గ్రామ పంచాయతీగా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఏదేమైనా తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపాలని రాతపూర్వకంగా  కలెక్టర్ ను, ఎమ్మెల్యేను గ్రామస్తులు కోరారు.