న్యూఢిల్లీ, నవంబర్ 15: దేశంలో మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరలు జనవరి నుంచి పెరగనున్నాయి. భార త్‌లో తాము విక్రయించే అన్ని మోడ ల్స్ ధరల్ని 3 శాతం వరకూ పెంచుతామని శుక్రవారం మెర్సిడెస్ బెంజ్ ఇండియా తెలిపింది. ముడి వ్యయా లు, నిర్వహణా వ్యయాలు పెరగడం తో కార్ల ధరలను 2025 జనవరి 1 నుంచి పెంచుతామని వెల్లడించింది. జీఎల్‌సీ ధర రూ. 2 లక్షలు, టాప్‌ఎండ్ మెర్సిడెస్ మేబాక్ ధర రూ.9 లక్షల మేర పెరుగుతుందని కంపెనీ ప్రకటన తెలిపింది.
ఈ ఏడాది డిసెంబర్ 31లోపు బుక్‌చేసుకున్న కార్లకు పెంపుదల వర్తించదని మెర్సిడెస్ బెంజ్ ఇండియా సీఈవో సంతోష్ అయ్యర్ వెల్లడించారు.