calender_icon.png 27 October, 2024 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేరా రేషన్.. ఫుల్ ఇన్ఫర్మేషన్

30-08-2024 12:43:00 AM

యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం

రేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు

ఉన్నచోటే బియ్యం తీసుకునే వెసులుబాటు మెదక్ జిల్లాలో 1,99,917 రేషన్ కార్డులు

వెల్దుర్తి, ఆగస్టు 29: రేషన్ పంపిణీలో పారదర్శకత పాటించేలా కేంద్ర ప్రభుత్వం నూతన విధానానికి తెరదీసింది. సెల్‌ఫోన్‌లోనే సమస్త సమాచారాన్ని అందించేందుకు వీలుగా ‘మేరా రేషన్’ యాప్‌ను రూపొందించింది. పేదవారికి అండగా ఉండేందుకు ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను అమలు చేస్తోంది.

రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ప్రతినెలా రూపాయికే కిలో బియ్యం అందిస్తున్నారు. రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఇటీవల ఓటీపీ, ఐరిస్ విధానం అమలు చేస్తోంది. తాజాగా మరింత పారదర్శకత సాధించేందుకు మేరా రేషన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 

మెదక్ జిల్లాలో 1,99,917 రేషన్ కార్డులు

మెదక్ జిల్లాలో 520 రేషన్ దుకాణాలకు గాను 1,99,917 ఆహారభద్రత కార్డులు, 13,871 అంత్యోదయ కార్డులు, 62 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. ప్రతినెలా 4,372 టన్నుల బి య్యం పంపిణీ జరుగుతోంది. రేషన్ దుకాణాల ద్వారా ప్రస్తుతం ఓటీపీ, ఐరిస్ విధానం అమలులో ఉండడంతో లబ్ధి దారులు నేరుగా వస్తేనే బియ్యం తీసుకునే వీలుంటుంది. ఉపాధి కోసం వివిధ పట్టణాల్లో ఉంటున్నవారు రేషన్ తీసుకునేం దుకు కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్..వన్ రేషన్ విధానం తీసుకొచ్చింది. లబ్ధిదారులు తాము ఉంటున్న చోటు నుంచే రేషన్ దుకాణంలో బియ్యం తీసుకునే వెసులుబాటు కల్పించింది. మేరా రేషన్ యాప్ ద్వారా తమ ఇబ్బందులను ఫిర్యాదు రూపంలో ప్రభు త్వం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం  కల్పించింది. 

యాప్‌లో ఉండే అంశాలు

సమీపంలోని రేషన్ దుకాణం, అందుబాటులో ఉన్న సరుకుల గురించి తెలుసుకో వచ్చు. కొత్త ప్రదేశానికి వలస వెళ్లే వారికి ఎంతో ఉపయోగకరం. రేషన్ దుకాణం చిరునామా కోసం ఇతరులను అడగాల్సిన పనిలేదు. రేషన్ కార్డు ద్వారా ఇటీవల జరిపిన లావాదేవీల వివరాలు తెలుస్తాయి. గడిచిన ఆరు నెలల్లో ఏ సరుకులు తీసుకున్నారో యాప్‌లో ఉం టాయి. ఒకవేళ లబ్ధిదారుడు సరుకులు తీసుకోకపోయినా తీసుకున్నట్లు చూపితే ఫిర్యాదు చేయవచ్చు.

రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానమైందీ లేనిదీ తెలుసుకోవచ్చు. ఏదైనా రేషన్ దుకాణంలో డీలర్ సమయపాలన పాటించకపో యినా, అక్రమాలకు పాల్పడుతున్నా యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో యాప్ సేవలు అందుబాటులో ఉండగా త్వరలోనే తెలుగులోనూ అందనున్నాయి. అయితే యాప్‌ను మొబైల్‌లోని ప్లే స్టోర్‌లోకి వెళ్లి మేరా రేషన్ యాప్ అని టైప్ చేయాలి. తర్వాత డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకన్నాక ఆప్షన్లను ఎంపిక చేసుకొని సేవలను పొందవచ్చు.