సిద్దిపేట (విజయక్రాంతి): మున్సిపల్ పట్టణాల్లో మెప్మా పరిధిలో పనిచేస్తున్న ఆర్పీలకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు అమలు చేసి భీమా సౌకర్యం కల్పించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాలస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేవలం రూ .6 వేల గౌరవేతనమిస్తూ వేట్టి చాకిరి చేయించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ సర్వేలు సంక్షేమ పథకాలు , ఎన్నికల కోసం అనేక రకాలుగా ప్రభుత్వ పనులకు ఉపయోగించుకుంటున్నారని అన్నారు. డ్వాక్రా మహిళలకు గ్రూపులు ఏర్పాటు చేయడం అనేక విధములైన రుణాలు మంజూరు ఇప్పించడం మరలా ప్రతినెల రుణాలు కట్టే విధంగా గ్రూప్ సభ్యులను ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు.
నిత్యం ఆన్లైన్ లో విధులు నిర్వహిస్తూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు ప్రభుత్వ పథకాలు ప్రారంభించినప్పుడు సభలు సమావేశాలకు డ్వాక్రా మహిళలను సమీకరించి విజయవంతం కోసం కృషి చేయడం జరుగుతుందని అన్నారు ఆర్పీలందరికీ జీవో 60 ప్రకారం రూ.19500 ఇవ్వాలని, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులుగా కాముని గోపాలస్వామి, అధ్యక్షురాలుగా ఎ.కవితరాణి(దుబ్బాక), ప్రధాన కార్యదర్శిగా పి.సుభద్ర(గజ్వేల్), కోశాధికారిగా పద్మ (హుస్నాబాద్), ఉపాధ్యక్షురాలుగా లత (చేర్యాల), సహాయ కార్యదర్శిగా ఎన్.పద్మ (గజ్వేల్) కమిటీ సభ్యులుగా శ్యామల, మమతా, శ్రీలత, పద్మ అను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఆర్పీలు పాల్గొన్నారు.