- 68 మండలాలకు ఒక్కరే రెగ్యులర్..
- మిగిలన చోట పీజీ హెడ్మాస్టర్లే ఇన్‌చార్జులు
- ఆదిలాబాదు జిల్లాలో గాడితప్పుతున్న విద్యావ్యవస్థ
- 2005 నుంచి నిలిచిపోయిన నియామకాలు
నిర్మల్, ఆగస్టు 2 (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలో విద్యా వ్యవస్థ గాడితప్పుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు బడులను పర్యవేక్షించే మండల విద్యాధికారులను నియమించడంలో ప్రభుత్వం నిర్ల క్ష్యం వహిస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలో 68 మండలాలు ఉండగా.. దహేగాంలో మాత్రమే రెగ్యులర్ ఎంఈవో ఉన్నారు. మిగిలిన 67 మండలాల్లో సీనియర్ పీజీ హెడ్మాస్టర్లకు బాధ్యతలను అప్పగించారు.
4 నుంచి 6 మండలాల బాధ్యతలు
ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు మొత్తం 4,116, 663 ప్రవేట్ పాఠశాలుల ఉన్నాయి. ప్రభుత్వ బడులల్లో 1,93,043 మంది విద్యార్థులు, ప్రైవేటు బడుల్లో లక్షన్నర మంది చదువుకుంటున్నారు. అయితే ఒక్కో ఇన్‌చార్జి ఎంఈవోకు 4 నుంచి 6 మండలాల బాధ్యతలను అప్పగించడంతో ఏ ఒక్క పాఠశాలను సైతం పూర్తిగా పర్యవేక్షించడం లేదు. 2005 నుంచి ఎంఈవోల నియామక ప్రక్రియ చేపట్టకపోవడంతో పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడింది.
విద్యా రంగంలో ఎన్నో సంస్కరణలను తెస్తున్నట్లు ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలు ప్రకటనలుగానే మిగిలుతున్నాయి. ఎంఈవోగా బాధ్యతలు చేపట్టిన హెడ్‌మాస్టర్లు ఇటు విద్యాధికారిగా పనిచేస్తూనే తమ పాఠశాల నిర్వహణను చూసుకుంటున్నారు. దీంతో పని భారం పెరిగి మానసిక ఒత్తిడితో అనారోగ్యానికి గురవుతున్నారు.
విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా చూస్తున్నాం
జిల్లాలో ఎం ఈవో పోస్టులు ఖా ళీగా ఉన్నా ప్రభు త్వ ఆదేశాల మేర కు సీనియర్ పీజీ హెడ్మాస్టర్లకు ఎంఈవోలుగా బాధ్యతలు అప్పగించాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తు న్నాం. ఉన్న వారితోనే సర్దుకుంటూ విద్యాకాలెండర్‌ను పూర్తిచేసి మంచి ఫలితాలను రాబడుతున్నాం. ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి కావడంతో ఇప్పుడు చదువు, సదుపా యాలపై దృష్టి పెట్టాం.
రవీందర్‌రెడ్డి, డీఈవో, నిర్మల్