17-04-2025 06:33:20 PM
లక్షేట్టిపేట (విజయక్రాంతి): మండలంలోని దౌడపల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం మండల విద్యాధికారి హెలెన్ డారతి(MEO Helen Darathi) బడిబాట కపరత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.... విద్యార్థుల మంచి భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉంటారన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో చిన్నారుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరిధర్, ఉపాధ్యాయులు సతీష్, రాజ కుమారి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.