26-03-2025 09:45:52 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ముత్యపు రాఘవులు ఫంక్షన్ హాల్ లో బుధవారం నాడు ఎల్లారెడ్డి ఎంఈఓ ఏ వెంకటేశం ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి రాజు హాజరై మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖలో పాలనపరంగా ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి ఎంఈఓ వెంకటేశం అని అన్నారు. ఆయన అంచలంచలుగా ఎంఈఓ స్థాయి వరకు ఎదిగి విద్య శాఖకు అనేక సేవలు అందించారని అన్నారు.
ఎంతోమంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చిన ఘనత ఆయనకు ఉన్నదని,విధి నిర్వహణలో ఆయన చేసిన మంచి పనులు ఆయనకు గొప్ప గుర్తింపుని తెచ్చాయన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా, నాయకులు మత్తమాల ప్రశాంత్ గౌడ్, గోపికృష్ణ, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, ఆర్డీవో మన్నె ప్రభాకర్, పలువురు ఉపాధ్యాయులు, సన్నిహితులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.