calender_icon.png 27 December, 2024 | 10:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

9 మంది హెచ్‌ఎంలకు ఎంఈవో బాధ్యతలు

08-11-2024 12:56:37 AM

హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): తొమ్మిది మంది ప్రధానోపాధ్యాయులకు ఇన్‌ఛార్జి మండల విద్యాధికారులు(ఎంఈవో)గా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు వారికి పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నర్సింహారెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈఏడాది సెప్టెంబర్‌లో నియమించిన వారిలో కొంతమంది హెచ్‌ఎంలు ఎంఈవోలుగా బాధ్యతలు చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా 9 మండలాలకు ఎంఈవోలను నియమిస్తూ హెచ్‌ఎంలకు అదనపు బాధ్యతలను అప్పగించారు.