22-03-2025 08:20:01 PM
చర్ల (విజయక్రాంతి): మండలంలోని ఆర్ కొత్తగూడెం గ్రామంలో గల శ్రీ రామచంద్ర స్కూల్ 13వ వార్షికోత్సవ సందర్భంగా ఎంఈఓ పరిటాల వెంకటరమణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు స్వాగత గీతంతో ప్రారంభించి వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ పరిటాల వెంకటరమణ మాట్లాడుతూ... విద్యార్థులలో విద్యాసామర్ధ్యాలను మరింతగా మెరుగుపరచాలని, విద్య పట్ల ఆసక్తిని పెంచే విధంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆలోచనలు చేయాలని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గత పదమూడు సంవత్సరాలుగా విద్యా సేవలను అందిస్తున్న శ్రీ రామచంద్ర స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామచంద్ర ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ దరిమిశెట్టి కృష్ణమోహన్, నరసింహారావు రిటైర్ టీచర్, మంతెన శ్రీనివాస రాజు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సత్యనారాయణపురం ప్రెసిడెంట్, ఆర్ఎంపి శ్రీను, ఇందల బుచ్చిబాబు, కలగర్ రామకృష్ణ, ఎక్కడి సాంబశివరావు, కరస్పాండెంట్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.