సీనియర్ హెచ్‌ఎంలకు అదనపు బాధ్యతలు
హైదరాబాద్, సెప్టెంబర్ 24(విజయక్రాంతి): ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి మండలానికి ఒక మండల విదాధికారి (ఎంఈవో)ని నియమించింది. మండల్ నోడల్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న సీనియర్ హెచ్‌ఎంలకు ఎంఈవోలుగా అదనపు బాధ్యతలిస్తూ మంగళవారం విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
దాదాపు 20 ఏళ్ల తర్వాత ప్రతి మండలానికి ఒక మండల విద్యాధికారిని నియమించడంతో పలు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. 2005లో చివరిసారిగా మండల విద్యాధికారులు పదోన్నతులు పొం దారు. ఆ తర్వాత ఉన్న వారికి, ఉపాధ్యాయులకు, పదవీ విరమణ పొందినవారికి బాధ్యతలు అదనంగా ఇస్తూ ఒక్కో జిల్లాలో ఎంఈవోకు ఆరు, ఏడు, ఎనిమిది, పది మండలాలు ఇన్‌చార్జీలుగా ఇస్తూ వచ్చారు.
దీంతో పర్యవేక్షణ కొరవడింది. రేవంత్‌రెడ్డి సర్కార్ విద్యావ్యవస్థను గాడి లో పెట్టేందుకు ఎంఎన్‌వోలకు అదనపు బాధ్యతలు ఇచ్చి మండలానికి ఒక అధికారి ఉండేలా చర్యలు తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.