calender_icon.png 23 February, 2025 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల పాఠశాలల్లో మెనూ పాటించాలి

22-02-2025 01:05:44 AM

జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ 

సిద్దిపేట, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): గురుకుల పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం అందించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలను సందర్శించి పరిశీలించారు. తరగతి గదులను,  భోజనశాలను, వంటశాలను,  డార్మెటరీని, టాయిలెట్స్ ని తనిఖీ చేశారు. పదవ తరగతి, ఇంటర్ విద్యార్థులతో మాట్లాడారు.  సంభాషించారు. ప్రతిరోజు నిర్వహించే స్లిప్ టెస్ట్ ల గురించి అడిగి తెలుసుకున్నారు. రాబోయే పరీక్షలకు విద్యార్థులు తీసుకొనవలసిన తగు జాగ్రత్తలు, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ భాను ప్రకాష్, తహసీల్దార్ సలీం , మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్, జిల్లా వైద్యాధికారి పల్వాన్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.