- గురుకులాలు, కేజీబీవీల్లో అందని పౌష్టికాహారం
- ప్రిన్సిపాళ్లు, కేజీబీవీ ప్రత్యేక అధికారుల చేతివాటం?
- జిల్లా అధికారులకు ప్రతీనెల మామూళ్లు
సంగారెడ్డి, డిసెంబర్ 4 (విజయక్రాంతి): విద్యార్థులు పౌష్టికాహారంతో ఇబ్బందులు పడొద్దని ప్రభుత్వం అన్నీ విధాల కృషి చేస్తోంది. కానీ కొందరు అవినీతిపరుల వల్ల ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదు.
కొన్నిచోట్ల విద్యార్థులకు ప్రతీరోజు పచ్చిపులుసు, సాంబార్ పెడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో 1247 ప్రభుత్వ పాఠశాలలు, 48 గురుకులాలు, 17 కస్తూర్బాలు, 19 ఆదర్శ పాఠశాలలున్నాయి. ప్ర భుత్వ పాఠశాలలు, ఆదర్శ పాఠశాల విద్యార్థులకు రోజూ మధ్యాహ్న భోజనం పెడు తారు.
గురుకుల, కేజీబీవీ విద్యార్థులు అక్క డే ఉండి చదువుకుంటారు. వీరికి నాణ్యమైన భోజనం పెటేందుకు ప్రభుత్వం రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. సాం ఘిక సంక్షేమ, గిరిజన గురుకుల, మహాత్మా జ్యోతిబా పూలే, మైనార్టీ గురుకులాల్లోనూ విద్యార్థులకు పౌష్టికాహారం లభిచండం లేదనే ఆరోపణలున్నాయి.
అందించాల్సినవి..
గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించేందుకు నిధులు వెచ్చిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మెనూ రూపొందించింది. ఉదయం ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా, సాంబార్, చట్నీ, పాలకూర, గుడ్లు, ఇవ్వాలని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనంలో అన్నం, పప్పు, కూరగాయలు, పెరుగు, అప్పడాలు, (వారంలో 2 రోజులు మాంసాహారం); సాయంత్రం బిస్కెట్లు, టీతో పాటు పాటు రాత్రి భోజనంలో అన్నం, పప్పు కూర, కూరగాయలు విద్యార్థులకు అందించాలి.
కాగా ప్రభు త్వం సూచించిన మెనూ ఇక్కడా అమలు కావడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, కొందరు అధికారులు గురుకుల పాఠశాల నిర్వహకులు, కేజీబీవీ, సంక్షేమ వసతి గృహల్లో పని చేసే అధికారుల నుంచి ప్రతి నెల డబ్బులు తీసుకుం టున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతినెలా డబ్బులు ఇవ్వకపోతే జిల్లా అధికారులు తనిఖీలు చేసి మెమోలు ఇస్తున్నారని, అదే డబ్బులు సకాలంలో ఇస్తే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
అవినీతి జరిగేది ఇక్కడే?
రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు, కేజీబీవీలకు లక్షల నిధులు ఖర్చు చేస్తున్నా ప్రిన్సిపాళ్లు, ప్రత్యేక అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. యేటా వంట సామగ్రి, కూరగాయలు, చికెన్, మటన్, పాలు, పెరుగు సరఫరా చేసేందుకు టెండర్లు వేసి, ఏజెన్సీలకు సరఫరా చేసే బాధ్యతలు అప్పగిస్తారు.
కాగా ఈ ఏజెన్సీలతో ప్రిన్సిపాళ్లు, ప్రత్యేక అధికారులు లోపాయికారీ ఒప్పందం చేసుకొని వారి నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. నాణ్యమైన వాటిని తీసుకోకున్నా సైలెంట్‌గా ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. 50 మందికి పెట్టాల్సిన ఆహారాన్ని 100 మందికి పెట్టి మిగుల్చుకుంటున్నారని తెలుస్తోంది.
ఉదాహరణకు చికెన్, మంటన్ 10 కిల్లో సరఫరా చేస్తున్నట్లు రికార్డులు రాసి, 5 కిల్లోలు సరఫరా చేస్తున్నారని తెలిసింది, ప్రతీ వస్తువులోనూ కోతలు విధిస్తున్నారు. బియ్యంలోనూ పురుగులు ఉన్న పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అయినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.