నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
కామారెడ్డి, నవంబర్ 10 (విజయక్రాంతి): క్రీడలు మానసిక ఉల్లాసా న్నిస్తాయని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో కైసర్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో భారతరత్న మౌలానా అబ్దుల్‌కలాం ఆజాద్ మోమోరియల్ అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమన మాట్లాడుతూ.. క్రీడాకారులు ఆటల్లో గెలుపోటములను లెక్కచేయకుండా పాల్గొనాలని కోరారు. అథ్లెటి క్స్ ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు. క్రీడల్లో నైపు ణ్యతను సాధించేందుకు పోటీల్లో పాల్గొనాలని క్రీడాకారులకు సూచించారు.
అథ్లెటిక్స్‌లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను ఎమ్మె ల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో కైస్ అకాడమీ ప్రతినిధులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మార గంగారెడ్డి, కాటిపల్లి నగేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.