03-03-2025 12:08:03 AM
మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
నల్లగొండ, మార్చి 2 (విజయక్రాంతి) : ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత సాధ్యమని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. దామరచర్ల మండలం గణేశ్‌పహాడ్ గ్రామంలో నిర్మించిన రామాలయంలో ఆదివారం ధ్వజస్తంభ ప్రతిష్ఠోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఆశీస్సులతో రాష్ర్ట ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనవంతు సహకారం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.