calender_icon.png 17 April, 2025 | 8:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మిక మార్గంలోనే మానసిక ప్రశాంతత

08-04-2025 05:20:08 PM

భూక్యా జాన్సన్ నాయక్..

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సూర్జాపూర్ గ్రామంలోని వెంకటేశ్వర ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం మంగళవారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గం ఇన్చార్జి భూక్య జాన్సన్ నాయక్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... ఆధ్యాత్మిక మార్గంలోనే మానసిక ప్రశాంతత ఉంటుందని, శాంతిని కాంక్షిస్తూ లోకకళ్యాణార్థం చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు.

కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హనుమాన్ దీక్ష ఉపాసకులు భోగ శ్రీనివాస్, వేద పండితులు యజ్ఞచార్యులు చక్రపాణి నరసింహ మూర్తి, ప్రధాన అర్చకులు కోటపల్లి అనిల్, అర్చకులు కోటపల్లి నితీష్ లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు గ్రామాల నుంచి ఈ చాలీసా కార్యక్రమానికి ప్రజలు హాజరయ్యారు. జాన్సన్ నాయక్ తో పాటు టిఆర్ఎస్ నాయకులు పలువురు పాల్గొన్నారు.