calender_icon.png 27 November, 2024 | 6:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానసిక ఆరోగ్యమే మహా భాగ్యం..

10-10-2024 03:34:38 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): మానసిక ఆరోగ్యమే మహా భాగ్యం అని జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమా అధికారి, డాక్టర్ శ్రీధర్ మెట్పల్లివార్ అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మెట్పల్లివార్  మాట్లాడుతూ.. మానసిక ఆరోగ్యాన్ని మించిన సంపద మరొకటి లేదన్నారు. చిన్న చిన్న సమస్యలకు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని తెలిపారు. అనవసర ఆందోళనలతో ఆత్మహత్యల వంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. మానసిక ఒత్తిడితో బాధపడేవారు టోల్ ఫ్రీ నెంబర్ 14416 కు ఫోన్ చేసి ఉచిత కౌన్సిలింగ్ సహాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ ఓ డాక్టర్ సాధన, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ వై.సి శ్రీనివాస్, కార్యాలయ పర్యవేక్షకులు గోపి, స్టాటిస్టికల్ అధికారి బ్రహ్మనంద రెడ్డి, డెమో వెంకటరెడ్డి, సైకాలజిస్ట్ శ్రీకాంత్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీనివాస్, రమణ, కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.