calender_icon.png 13 January, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానసిక ఉల్లాసం

13-01-2025 01:02:35 AM

నారాయణపేట, జనవరి 12 (విజయ క్రాంతి): యువకులు క్రీడలు ఆడటం వల్ల శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లా సం కలుగుతుందని శారీరకంగా, దఢంగా ఉన్నప్పుడు పోలీసు, ఆర్మీ లాంటి ఉద్యోగా లు సాధించవచ్చని డీఎస్పీ ఎన్ లింగయ్య అన్నారు. స్వామి వివేకానంద 162వ జయం తి సందర్భంగా  అభంగాపూర్ గ్రామంలో గ్రామ యువకులు ఏర్పాటు చేసిన  క్రికెట్ టోర్నమెంట్ పోటీలను డీఎస్పీ ఎన్ లింగ య్య, సిఐ శివ కుమార్‌లు ముఖ్య అతిథులు గా హాజరై స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి క్రికెట్ పోటీలను ప్రారంభించారు.

ముందు గా క్రీడాకారులను పరిచయం చేసుకుని డిఎ స్పి , సిఐ  కొద్దిసేపు బ్యాటింగ్, బౌలింగ్ చేసి అందరినీ ఉల్లాసపరిచారు. ఈ సందర్భంగా డీఎస్పీ  మాట్లాడుతూ... స్వామి వివేకానంద ను యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వివేకానం దుని బోధనలు యువతకు స్ఫూర్తి దాయక మన్నారు. ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి స్వా మి వివేకానంద అని సమాజాభివద్ధి కోసం రామకష్ణ మఠం స్థాపించి ఎన్నో సేవా కార్య క్రమాలు నిర్వహించారు.

యువత క్రీడలు ఆడడం వల్ల శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని యువకు లు, విద్యార్థులు చిన్నతనం నుండే క్రీడలపై మక్కువ చూపాలని తెలిపారు. ఆటలో గెలుపోటములు సహజమని ఓడిపోయిన వారు బాధపడకుండా మళ్ళీ ప్రయత్నించి గెలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి నరసింహులు, మాజీ సర్పంచ్ విక్రమ్ వర్ష, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు బాగవంత్, లక్ష్మి కాంత్, రాము లు, రమేష్, చెనప్ప పాల్గొన్నారు.