calender_icon.png 3 April, 2025 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుస్తక పఠనంతో మానసిక వికాసం

24-03-2025 12:00:00 AM

తెలంగాణ సాంస్కృతిక సారథి డాక్టర్ గుమ్మడి వెన్నెల

ముషీరాబాద్, మార్చి 23: (విజయక్రాం తి): పుస్తక పఠనంతో మానసిక వికాసమని తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ డాక్టర్ గుమ్మడి వెన్నెల అన్నారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద పుస్తక ప్రదర్శనను తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సారథి డాక్టర్ గుమ్మడి వెన్నెల ప్రారంభించారు.

సందర్భం గా ఆమె మాట్లాడుతూ.. పుస్తకం మనిషిని ఉన్నతునిగా తీర్చిదిద్దుతుందని, మానసిక వికాసాన్ని , విజ్ఞానాన్ని,  చైతన్యాన్ని పెంచుతుందన్నారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం చేయాలని, నెలకు ఒక పుస్తకమైనా చదవాలని ఆమె కోరారు. తన తండ్రి గద్దర్ ఆపరే షన్ థియేటర్లోకి వెళ్లే ముందు కూడా పుస్తక పఠనం కొనసాగించారని, తమతో ఎన్నో పుస్తకాలు చదివింప చేశారని అన్నారు.

పోటీ పరీక్షల కోసం మాత్రమే కాకుండా విద్యార్దులు జ్ఞానార్జనకై పుస్తక పఠనం చేయాలని ఆమె అన్నారు. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు పుస్తకాలు చదివితే, వారిని చూసి పిల్లలు చదువుతారని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రదర్శనను అందరూ సందర్శించాలని, అన్ని పబ్లిషర్ల పుస్తకాలపై హెచ్చు డిస్కౌంట్‌తో పుస్తకా లు అందించడం అభినందనీయమని ఆమె అన్నారు. డిజిటల్ యుగంలో సాహిత్యాన్ని ప్రోత్సహించే సంస్థలు అరుదుగా ఉన్నాయన్నారు. 

రామానంద తీర్థ గ్రామీణ యూనివర్సిటీ చైర్మన్ నారా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని ప్రముఖ పబ్లికేషన్స్ పుస్తకాలు నిరుద్యోగ అభ్యర్థులకు  అందుబాటులో ఉండే విధం గా తెలంగాణ పబ్లికేషన్స్ చేస్తున్న కృషి ని ఆయన  అభినందించారు. తెలంగాణ పబ్లికేషన్స్ వ్యవస్థాపకుడు కోయ చంద్రమోహన్ మాట్లాడుతూ ఈ పుస్తక ప్రదర్శన మార్చి 24 తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు.

పుస్తక ప్రియులు పుస్తక ప్రదర్శనను సందర్శించి, సద్వినియోగం చేసుకోవా ల్సిందిగా కోరారు. ఈ సభలో అవని ఫౌండేషన్ ప్రతినిధి వాగ్దేవి, కవి, రచయిత తంగిరాల చక్రవ ర్తి, ది వైర్ పత్రిక తెలుగు ఎడిటర్ నెల్లూరు నరసింహారావు,  సామాజిక కార్యకర్త గురుమూర్తి, జిల్లా నరేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.