ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటుడు శ్రీకాంత్
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 26 (విజయక్రాంతి): స్టార్ హాస్పిటల్స్ ‘స్టార్ క్యాన్సర్ సెంటర్’ ఆధ్వర్యంలో క్యాన్సర్ బారిన పడిన మహిళలకు అండగా నిలుస్తున్న మగవారి పాత్రని వివరిస్తూ శనివారం ‘మెన్ ఫర్ ఉమెన్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్స ర్ బారినపడిన మహిళలకు కుటుంబమం తా అండగా నిలవాలని అన్నారు. దేశంలోని మహిళల్లో రొమ్ము క్యాన్సర్ అత్యంత సాధారణమైందని స్టార్ వైద్యులు తెలిపారు. 2022 సంవత్సరంలోనే 2,16,108 రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని వివరించారు. రాబోయే రోజుల్లో రొమ్ము క్యాన్సర్ వ్యాధి గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో భాగం గా స్టార్ హాస్పిటల్స్ ‘స్టార్ సహయా’ను ప్రారంభించింది. ఇది వివిధ ఆరోగ్య పరిస్థితుల గురించి ప్రజలకు ప్రాథమిక దశలోనే కీలకమైన సమాచారాన్ని అందిస్తుందన్నారు. స్టార్ హాస్పిటల్స్ గ్రూప్ ఎండీ డాక్టర్ మన్నం గోపిచంద్, జాయింట్ ఎండీ డాక్టర్ గూడిపాటి రమేశ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ రాహుల్ మేదక్కర్, వాకా భాస్కర్‌రెడ్డి, డాక్టర్ విపిన్ గోయల్ పాల్గొన్నారు.