14-03-2025 08:32:50 PM
మందమర్రి,(విజయక్రాంతి): నిరుపేద కుటుంబానికి చెందిన వృద్ధురాలు మృతి చెందగా అంత్యక్రియలు చేయలేనీ నిస్సహాయ స్థితిలో ఉన్న నిరు పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి, మేము సైతం స్వచ్ఛంద సేవా సంస్థ(Memu Saitham Seva Samstha) మానవతాన్ని చాటుకుంది. ఇటీవల అంగడి బజార్ ప్రాంతంలో జరిగిన హత్యాయత్యంలో గాయపడిన రాంబాయి అనే మహిళ మృతిచెందగా దహన సంస్కారాలకు నిర్వహించలేని దుస్థితిలో ఉన్న పేద కుటుంబ పరిస్థితి తెలుసుకున్న మేము సైతం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతల సహకారంతో సేకరించిన 8వేల రూపాయలను గురువారం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేము సైతం అధ్యక్షుడు బూబత్తుల శ్రీనివాస్, కమిటీ సభ్యులు సోమయ్య, అక్కెపెల్లి జనార్ధన్ లు పాల్గొన్నారు.