calender_icon.png 29 April, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదినిమిషాలు ఆలస్యమైందని నలుగురు వైద్య సిబ్బందికి మెమోలు

28-04-2025 12:43:37 AM

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 27 (విజయక్రాంతి): ప్రపంచ మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీకి పది నిమిషాలు ఆలస్యంగా వచ్చారన్న సాకుతో నలుగురు ( ఏంఎల్ హెచ్ పి) మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లకు మెమోలు జారీ చేశారు.

ఈనెల 25న జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా డిప్యూటీ వైద్యాధికారి వెంకట దాసు ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తాడూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఇంద్రకల్ గ్రామ ఏంఎల్ హెచ్ పి మెర్సీ మాధురి, ఐతోల్ హేమలత, కుమ్మెర హర్షవర్ధన్, మేడి పూర్ రమాదేవి లకు తాడూరు మండల  వైద్యాధికారి సంతోష్ అభిరామ్ ఆలస్యానికి గల కారణాలు వివరణ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 25న మెమోలు జారీ చేశారు. 

మరికొందరు విధులకు హాజరు కాకుండానే రెగ్యులర్గా డుమ్మా కొడుతూ జీతాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు సదురు అధికారి సైతం అవగాహన ర్యాలీకి ఆలస్యంగా వచ్చినట్లు ఇతర వైద్యాధికారుల ఆరోపించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ అంశం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.