calender_icon.png 26 October, 2024 | 5:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

అక్రమ బ్రిడ్జి నిర్మాణాన్ని కూల్చివేయాలని ఆర్డిఓ కు మెమోరాండం

26-10-2024 03:56:14 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): పెద్దనపల్లి సమీపంలో ఒక ధార్మిక సంస్థకు వెళ్లే మార్గంలో ప్రకృతి సిద్ధంగా ప్రవహించే కాలువపై నిర్మిస్తున్న అక్రమ బ్రిడ్జిని వెంటనే కూల్చివేయాలని, బ్రిడ్జిని నిర్మిస్తున్న ప్రైవేటు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం బిజెపి ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షులు కోడి రమేష్ ఆధ్వర్యంలో నాయకులు బెల్లంపల్లి ఆర్డీవో కార్యాలయంలో మెమోరాండం అందజేశారు. సామాన్య ప్రజలు చిన్నపాటి ఇల్లు నిర్మాణం జరిపితే హంగామా సృష్టించే రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఒక ధార్మిక సంస్థ ఎవరి అనుమతులు లేకుండా ప్రైవేటు బ్రిడ్జి నిర్మిస్తున్న ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు.

వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి ఈ బ్రిడ్జిని ప్రైవేట్ వ్యక్తులు రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం నిర్మిస్తున్న ఇరిగేషన్ అధికారులు అటువైపు చూడాలని లేదని వాపోయారు. అక్రమంగా ప్రైవేటు వ్యక్తులు నిర్మిస్తున్న ఈ బ్రిడ్జిని వెంటనే కూల్చివేయాలని, ఇందుకు బాధ్యులైన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాసిపేట మండల అధ్యక్షులు సూరం సంపత్ కుమార్, బెల్లంపల్లి పట్టణ ఉపాధ్యక్షులు రాంచందర్, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు కనకం శ్రీనివాస్, జీదుల రాములు, జిల్లా కార్యదర్శి కోడి సురేష్, పుల్లూరి రామ్ రెడ్డి, బాలరాజు, విష్ణువర్ధన్, సాయి తదితరులు పాల్గొన్నారు.