28-04-2025 10:23:40 PM
కామారెడ్డి (విజయక్రాంతి): టిజీజేఏసీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా, ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర శాఖ పిలుపుమేరకు సోమవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలో రాష్ట్ర అగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్(State Agro Industries Corporation) చైర్మన్ కాసుల బాలరాజుకు ఉద్యోగులు మెమోరాండం అందజేశారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు, ఉద్యోగుల 57 సమస్యల పరిష్కారానికి మండల కేంద్రంలోని ఉద్యోగుల, గజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల పెన్షనర్ల, వర్కర్స్ సమస్యలపై మెమోరాండం అందజేశారు.
ఉద్యోగుల సమస్యలపై కాసుల బాలరాజు పెండింగ్ బిల్స్, పెండింగ్ 5 డిఎలు పిఆర్సి, హెల్త్ కార్డులు, సిపిఎస్ రద్దు, పెన్షనర్ల బకాయిలు, ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యూలరైజ్ మొదలగు 57 సమస్యలను టీజీజేఏసీ చైర్మన్ నరాల వెంకటరెడ్డి వివరించారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రితో చర్చించి, అన్ని రకాల ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని వారికి విన్నవించడం జరిగింది. ముఖ్యంగా సిపిఎస్ ను రద్దు చేసి, ఓపిఎస్ ను ప్రవేశపెట్టాలని మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా హామీలను నిలబెట్టుకోవాలని వారినీ కోరారు.
ఈ సందర్భంగా చైర్మన్ కాసుల బాలరాజ్ మాట్లాడుతూ... సమస్యల పరిష్కారానికి తనవంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, సమస్యలపై ప్రభుత్వానికి తెలియజేస్తానని నా మీద ఉన్న నమ్మకంతో మీ సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ చైర్మన్ సానుకూలంగా స్పందించారు. చైర్మన్ ను కలిసిన వారిలో నరాల వెంకట్ రెడ్డి, టీజీజేఏసీ చైర్మన్ డాక్టర్ దేవేందర్, సెక్రటరీ జనరల్, అడిషనల్ సెక్రటరీ జనరల్ కుశాల్, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి ఎమ్ నాగరాజు, ప్రభుత్వ ఉద్యోగులు సాయి రెడ్డి, దయానంద్, రాజారామ్, సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.