calender_icon.png 1 April, 2025 | 6:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీమ్స్ మంచివే!

23-03-2025 12:00:00 AM

సోషల్‌మీడియాలో కనిపించే మీమ్స్‌కుండే ఆదరణ ఏ స్థాయిదో.. వాటిని యువత ఎంతగా ఇష్టపడతారో తెలిసిందే. ఒక ఫోటో, దాంతో పాటు నవ్వించే చిన్న ట్యాగ్‌లైన్స్‌తో ఎంత పెద్ద విషయాన్నైనా ఈ మీమ్స్ సింపుల్‌గా చెప్పేస్తుంటాయి. యువతరం ఇష్టపడే ఇవే మీమ్స్‌ని చదువులో అర్థం కాని విషయాల కోసం ఉపయోగిస్తే ఎలా ఉంటుందనే దిశగా పరిశోధన చేసింది ఫిలిప్పీన్స్‌కి చెందిన అటీనియోడే మనిలా యూనివర్సిటీ.

చాలామంది పిల్లలకి సైన్స్ కఠినంగా అనిపిస్తుంది. కాస్త చదవగానే బోర్ అనేస్తారు. అలా కాకుండా సైన్స్‌ని సరదా, సరదాగా బోధిస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు శాస్త్రవేత్తలు. ఇందులో భాగంగా నే కొంతమంది హైస్కూల్ పిల్లల్ని ఎంచుకుని, రెండు బృందాలుగా విడదీసి వీరికి కణవిభజనా, జన్యువులూ వంటి కఠినమైన అంశాలని ఇచ్చారు.

వీరిలో ఒక బృందానికి మీమ్స్ సాయంతో బోధిస్తే, మరికొందరికి సంప్రదాయ పద్ధతిలో బోధించారు. నెలన్నర తర్వాత రెండు బృందాలకీ పరీక్ష పట్టినప్పుడు మీమ్స్‌తో నేర్చుకున్న పిల్లలు, నేర్చుకోని పిల్లలతో పోలిస్తే 21 శాతం మెరుగైన ఫలితాలని సాధించారు. పైగా సైన్స్‌లోని కొన్ని అంశాలని ఎంచుకుని సొంతంగా మీమ్స్‌నీ తయారుచేశారు. ఈ విధానంలో సైన్స్ నేర్చుకోవడంపట్ల ఆసక్తి పెరుగుతున్నదని పరిశోధనలో వెల్లడైంది.