హుజూర్ నగర్: ఈరోజు టౌన్ హాల్ నందు హుజుర్ నగర్ పట్టణ వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం గౌరవ అధ్యక్షులు సామాజిక కార్యకర్త ఆకుల రాము చేతుల మీదుగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఈ సందర్బంగా ఆకుల రాము మాట్లాడుతూ.. పట్టణంలోని దివ్యాంగులందరూ పట్టణ కమిటీ ద్వారా చేపట్టే సభ్యత్వాన్ని తీసుకుని సంఘ ప్రతిష్టకు తోడ్పడాలని వికలాంగుల హక్కుల సాధన పోరాటంకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సంవత్సర చందా వంద రూపాయలు చెల్లించి రసీదు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ వికలాంగుల సంఘం అధ్యక్షులు మన్యం వీరాంజనేయులు, మండల వికలాంగుల సంఘం అధ్యక్షులు ఇందిరాల పిచ్చయ్య, పోనుగుపాటి లక్ష్మణరావు, కాలం శ్రీను, బంటు పుల్లయ్య, చింతిరాల వెంకటేశ్వర్లు, మహిళా అధ్యక్షురాలు రూపా రాణి తదితరులు పాల్గొన్నారు.