calender_icon.png 17 April, 2025 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానికేతరులకు సభ్యత్వాలపై విచారణ చేపట్టాలి

15-04-2025 03:18:12 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో స్థానికేతర్లకు సభ్యత్వం ఇచ్చిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొని, అర్హులైన వారినే సభ్యులుగా కొనసాగించాలని జిల్లా మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కు మత్స్యకారులు ఎద్దుల బోయిన యాకయ్య, సురేష్, గడ్డం ఉప్పలయ్య, బాలకృష్ణ, శ్రీనివాస్, ప్రశాంత్, గడ్డం నాగార్జున, మల్లయ్య, సాంబయ్య, మహేష్, ప్రశాంత్ తదితరులు ఫిర్యాదు చేశారు.

సొసైటీలో స్థానికేతరులకు  సభ్యత్వం ఇవ్వడానికి, కమిటీ సభ్యుల ఫోర్జర్ సంతకాలతో తీర్మానం రూపొందించారని ఈ మేరకు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ కాట్రపల్లి గ్రామంలో విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు మాట్లాడుతూ... కొందరు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం కమిటీ సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి, కాట్రపల్లి మత్స్య సొసైటీ తో సంబంధం లేని వారికి సభ్యత్వం ఇచ్చి కులవృత్తిపై ఆధారపడ్డ తమకు అన్యాయం చేసేందుకు చూస్తున్నారని ఫిర్యాదు చేశారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ ఇన్స్పెక్టర్కు విజ్ఞప్తి చేశారు.