calender_icon.png 26 November, 2024 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా సంఘాల సభ్యులు వ్యాపార రంగంలో రాణించి ఆర్థికంగా బలోపేతం కావాలి

26-11-2024 06:41:14 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్..

కామారెడ్డి (విజయక్రాంతి): మహిళా సంఘాల సభ్యులు వ్యాపార రంగంలో రాణించి ఆర్థికంగా బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. మంగళవారం లింగంపేట ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల సమాఖ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆకాంక్ష మేరకు మహిళా సంఘాల సభ్యులు, వ్యాపార రంగం ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. ప్రభుత్వం మహిళాభ్యుదయం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ, రుణాలు సమకూరుస్తుందని తెలిపారు. గ్రామీణా ప్రాంతాల్లో వ్యాపారాన్ని ప్రారంభించాలని సూచించారు. పాఠశాలల పిల్లల  యూనిఫాం కుట్టడానికి మహిళా సంఘాలే  నిర్వహిస్తున్నామని తెలిపారు.

వచ్చే సీజన్ నాటికి వరి కొనుగోళ్ల సంఖ్యను మహిళా సంఘాలే ఎక్కువ చేయాలని తెలిపారు. క్యాంటీన్, డైరీ,పిష్ పాండ్  తదితర వ్యాపారాలు కొనసాగించాలని తెలిపారు. సంఘాల్లో మహిళలను సభ్యులుగా చేర్చాలని,రుణాలు తీసుకున్న వారి నుండి రికవరి చేయాలని తెలిపారు. లింగంపేట మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలని తెలిపారు. అంతకుముందు 36 వేల రూపాయిలతో నిర్మించనున్న రూప్ టాప్ రైన్ వాటర్, హార్వెస్టింగ్ స్ట్రక్చర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ది  అధికారి సురేందర్ మాట్లాడుతూ 14 అంశాలతో సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. మహిళా సంఘాలు చేపడుతున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. మండల మహిళా అధ్యక్షురాలు సులోచన మాట్లాడుతూ కొత్త గ్రూప్‌లను ఏర్పాటు చేస్తున్నామని, పిండి  గిర్ణి,నాటు కోళ్లు, డైరీ, క్యాంటీన్ వంటి వ్యాపారాలు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీడీవో గంగాధర్, తహశీల్దార్ బిక్షపతి, ఐకెపి సిబ్బంది, మహిళా సంఘాల సభ్యురాలు తదితరులు పాల్గొన్నారు.