02-03-2025 08:19:02 PM
మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని అమరారం గ్రామంలో నిర్వహించే శ్రీ నాగదేవత జాతరకు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆహ్వానించారు. ఆదివారం మణుగూరులోని ఆయన నివాసంలో కలిసిన ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరుగు శ్రీ నాగ దేవత జాతరకు ముఖ్యఅతిథిగా పాల్గొని జాతరను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్, సింగరేణి ఏరియా ప్రాతినిధ్య సంఘం, ఐఎన్టియుసి బ్రాంచ్ ఉపాధ్యక్షులు వత్సవాయి కృష్ణం రాజు, నాగులమ్మ గుడి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.