21-02-2025 12:24:13 AM
ఆదివాసీ సాంప్రదాయాలతో ఘనస్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభునిగూడెం గ్రా మంలో కుంజ వారి ఇలవేల్పు కుంజ వం శస్థులు నిర్వహిస్తున్న శ్రీ సూరా పాపయ్య జాతర మహోత్సవంలో గురువారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం సూరా పాపయ్య దేవుడి గద్దెలకు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు పాయం మాట్లాడుతూ శంభునిగూడెం గ్రామంలో కుంజ ఓంశస్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించే శ్రీ శ్రీ శ్రీ సూరా పాపయ్య దేవుడి జాతరలో పాల్గొని పాపయ్య దేవుడిని దర్శించుకోవడం చాలా సంతోషకరమన్నారు.
శ్రీ శ్రీ శ్రీ సూరా పాపయ్య దీవెనలు పినపాక నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా కలిగి ఉండాలని ఆ దేవుడిని కోరుకున్నానని తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ సూర పాపయ్య దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 10వ మండల స్థాయి వాలీబాల్ ఆటల పోటీలో గెలుపొందిన విజేతలకు రూ. 10 వేలను అందజేసిశా రు. ఈ కార్యక్రమంలో గుండాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, శ్రీ సూరా పాపయ్య ఆలయ కమిటీ సభ్యులు, ఆదివాసి పెద్దలు, తదితరులు పాల్గొన్నారు